- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది కదా టాలెంట్ అంటే.. రెండు కాళ్లు లేకపోతేనేం.. అద్భుతమైన డ్యాన్స్‌తో ఆశ్చర్యపరుస్తున్నాడుగా!
అంగ వైకల్యం మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రెండు కాళ్లు లేకపోతే.. నడవడం, నిలబడటం, సొంతంగా ఏ పని చేసుకోవాలన్న పెద్ద సవాలుగా మారిపోతాయి.

దిశ, వెబ్ డెస్క్: అంగ వైకల్యం (Disability) మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రెండు కాళ్లు లేకపోతే.. నడవడం, నిలబడటం, సొంతంగా ఏ పని చేసుకోవాలన్న పెద్ద సవాలుగా మారిపోతాయి. ప్రతి చిన్న పనికి పక్కవారిపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది శారీరకంగా కాక, మానసికంగా కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ, కొంతమంది మాత్రం ఈ పరిస్థితులను ఓ సవాలుగా తీసుకుని, జీవితాన్ని కొత్త కోణంలో తిరిగి నిర్మించుకుంటారు. ఆత్మవిశ్వాసం, అంకిత భావం, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని నిరూపిస్తుంటారు. ప్రతిభకు అంగవైకల్యం అడ్డకాదని సమాజానికి చాటిచెబుతారు. కొరియోగ్రాఫర్ అబ్లు రాజేష్ కుమార్ కూడా ఈ కోవలోకే వస్తాడు.
కొరియోగ్రాఫర్ అబ్లు రాజేష్ కుమార్ (Ablu Rajesh Kumar) 13 ఏళ్ల వయసులో రైలు ప్రమాదంలో రెండు కాళ్లను కోల్పోయాడు. డ్యాన్స్ పట్ల ఉన్న అభిరుచి, జీవితం పట్ల ఆశ, ఏదైనా సాధించాలనే సంకల్ప బలం ఆయనను కొరియోగ్రాఫర్‌గా తీర్చిదిద్దింది. ప్రోస్థెటిక్ కాళ్లతో నృత్యం చేయడంలో అద్భుత ప్రతిభను కనబరిచారు. ఇటీవల, ఆయన బాలీవుడ్ పాట 'చిట్టియాన్ కలైయాన్'కు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆయన విద్యార్థులకు నృత్యం నేర్పిస్తూ, తన శక్తి, నైపుణ్యం, అభిరుచిని చూపించారు. ప్రస్తుతం, అబ్లు రాజేష్ కుమార్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో తన స్వంత డ్యాన్స్ అకాడమీని కూడా నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన బాలీవుడ్ పాట 'చిట్టియాన్ కలైయాన్'కు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆయన కృత్రిమ కాళ్ల సాయంతో విద్యార్థులకు నృత్యం నేర్పిస్తూ, తన శక్తి, నైపుణ్యం, అభిరుచిని ప్రదర్శించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రాజేష్‌ను ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిస్తున్నారు. కాగా, రాజేష్ 2022లో ప్రోస్థెటిక్ సహాయంతో సైక్లింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆగస్టు 15న, భారత జాతీయ పతాకాన్ని పట్టుకొని, ప్రోస్థెటిక్‌తో 1 కిలోమీటర్ సైక్లింగ్ చేసి, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. అబ్లు రాజేష్ కుమార్ కథ అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది.






