- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Video Viral:సింహాలతో గ్రామసింహాల ఢీ..తర్వాత ఏమైందంటే?
గ్రామసింహాల్ని తేలిగ్గా తీసిపారేస్తాం కానీ ఒక్కోసారి అవి తమకు ఎన్నో రెట్లు పెద్దవైన జంతువులపై కూడా తిరగబడతాయి. గుజరాత్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్:గ్రామసింహాల్ని తేలిగ్గా తీసిపారేస్తాం కానీ ఒక్కోసారి అవి తమకు ఎన్నో రెట్లు పెద్దవైన జంతువులపై కూడా తిరగబడతాయి. గుజరాత్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జంతువులకు సంబంధించిన చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే జనావాసాలకు దగ్గరగా ఉన్న అడవులలో నుంచి క్రూర మృగాలు సైతం జనావాసాల్లోకి రావడం గమనిస్తూనే ఉన్నాం. జనావాసాల్లోకి పులులు, సింహాలు రావడం వంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా రెండు సింహాల పై రెండు శునకాలు పోరాటం చేశాయి. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఏంటంటే..శునకాలు, సింహాలతో ఢీ కొట్టాయా? అని.. అయితే ఈ ఢీ అనేది సరాసరి కాదులెండి..గేటుకు బయటి వైపు సింహాలు, లోపలి వైపు కుక్కలు ఒకదానిపై ఒకటి రెచ్చిపోయాయి. ఏది ఏమైనా చివరికి మాత్రం సింహాలే వెనుదిరిగాయి. ఆమ్రేలిలోని ఓ ఆవుల షెడ్డు వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఈవీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రజెంట్ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు గ్రామసింహాల పవర్ వేరంటూ..సింహం రాజు వెనుదిరిగి పోయాడంటూ కామెంట్లు పెడుతున్నారు.






