Viral video: ఏంటీ.. జిరాఫీ నీళ్లు తాగాలంటే ఇంత కష్టపడాలా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-09 09:59:23  IST  )

నిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

Viral video: ఏంటీ.. జిరాఫీ నీళ్లు తాగాలంటే ఇంత కష్టపడాలా?
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా అడవి జంతువుల జీవన విధానాన్ని చూపించే వీడియోలను చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే ఈ వీడియోల్లో అవి చేసే పనులకు కొన్నిసార్లు భయంగా, ఆశ్చర్యకరంగా అనిపిస్తే.. మరికొన్ని సార్లు నవ్వులు తెప్పిస్తుంటాయి. ఇక తాజాగా నెట్టింట ఓ జిరాఫీ (Giraffe) వీడియో వైరల్ (video viral) అవుతోంది. ఇందులో ఆ జిరాఫీ నీళ్లు తాగేందుకు పడిన కష్టం గురించి చెప్పటం కాదు.. మీరే స్వయంగా చూసేయండి.

ప్రపంచంలో అత్యంత పొడవైన జంతువుల్లో జిరాఫ్ ఒకటి. పొడవైన, బలమైన దాని కాళ్లతో తంతే సింహం కూడా ఒక్క దెబ్బకే ప్రాణాలు విడుస్తుంది. పొడవాటి కాళ్లు ఉన్న జిరాఫీకి కొమ్మలు వంచి ఆకులు తినేయడం ఎంతో సులభం. కానీ అదే జిరాఫీ కింద కూర్చొవాలన్నా, నీరు తాగాలన్నా ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీడియోలో ఓ జిరాఫీ చెరువు దగ్గరకి వెళ్లి నీరు తాగేందుకు ఎంతో కష్టపడింది. తొలుత రెండు కాళ్లు బార్లగా చాచి నీటికి దగ్గరగా తల వంచింది. ఇంతలో ఏదో అలికిడి కావడంతో వెంటనే లేచి చుట్టూ పరిశీలించుకుంది. వేరే జంతువులు లేవని నిర్ధారించుకున్నాక మళ్లీ నీళ్లు తాగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చలించిపోతున్నారు. 'పాపం.. జిరాఫీకి నీళ్లు తాగడం కూడా కష్టమైపోయిందే.. ', 'పొడవాటి కాళ్లే చివరికి సమస్యగా మారాయి' అంటూ రకరకాలు కామెంట్లు పెడుతున్నారు.

Next Story