దాహాన్ని తీర్చుకునేందుకు వ్యక్తి సాయం కోరిన చింపాజీ.. తర్వాత ఏం చేసిందంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-11 12:06:39  IST  )

నిత్యం సోషల్ మీడియాలో (Social media) జంతువులకు సంబంధించి వేలాది వీడియోలు వైరల్ (Viral) అవుతూనే ఉంటాయి.

దాహాన్ని తీర్చుకునేందుకు వ్యక్తి సాయం కోరిన చింపాజీ.. తర్వాత ఏం చేసిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యం సోషల్ మీడియాలో (Social media) జంతువులకు సంబంధించి వేలాది వీడియోలు వైరల్ (Viral) అవుతూనే ఉంటాయి. అవి చేసే అల్లరి చేష్టలు, తెలివైన పనులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక మనుషులను మక్కీకి మక్కీకి అనుసరించటంలో కోతులు, గోరిల్లాలు, చింపాజీలు ముందుంటాయని తెలుసు. కొన్నిసార్లు వాటి ప్రవర్తన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

కెమరూన్ అడవుల్లో ఓ ఫోటోగ్రాఫర్‌, చింపాంజీ (Chimpanzee) మధ్య అద్భుతమైన దృశ్యం చోటుచేసుకుంది. ఓ చింపాంజీ దాహంతో అలమటిస్తోంది. దాని ముందే ఓ నీటి మడుగు ఉంది. కానీ, అది నీళ్లు తాగేందుకు ఇబ్బంది పడుతుండగా.. అడవిలో ఫోటోలు తీస్తున్న ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ జేసీ పియరీ కనిపడించాడు. వెంటనే అతడి వద్దకు వెళ్లి, చేయి పట్టుకుని మడుగు వద్దకు తీసుకువచ్చింది. అనంతరం ఫొటోగ్రాఫర్ చేతులు ఉపయోగించుకుని తన దాహాన్ని తీర్చుకుంది. ఆ తర్వాతే ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. తన ఎంగిలి అ వ్యక్తి చేతికి అంటుకుని ఉంటుందని భావించిదో ఏమో.. ఆ చింపాంజీ నీటితో అతని చేతులను కడిగి ఒక రకంగా కృతజ్ఞతను వ్యక్తం చేసింది. ఈ ఘటన ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Next Story