Viral video: పాకిస్తాన్ విషయంలో బీజేపీ ప్రభుత్వంపై నా అన్వేష్ ఏం చెప్పాడంటే?

by Yella Dhawani Reddy |

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో (Pahalgam) ఏప్రిల్ 22వ తేదీన జరిగిన భయానమైన ఉగ్రదాడిలో (terrorist attack) 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

Viral video: పాకిస్తాన్ విషయంలో బీజేపీ ప్రభుత్వంపై నా అన్వేష్ ఏం చెప్పాడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో (Pahalgam) ఏప్రిల్ 22వ తేదీన జరిగిన భయానమైన ఉగ్రదాడిలో (terrorist attack) 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిని యావత్‌ ప్రపంచం ఖండించింది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై, ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ జరపాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఈ ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌ (Pakistan) పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచింది. ఇప్పటికే భారత్- పాక్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసింది. అయితే, పాకిస్తాన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ ఫేమ్ యూట్యూబర్ అన్వేష్ (Anvesh) ఓ వీడియో చేశారు. ఇందులో పాకిస్తాన్‌ను బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా తిప్పికొట్టిందో వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

పాకిస్తాన్ విషయంలో మోడీ ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరించాలని అన్వేష్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో భారతదేశం అంటే కేవలం పాకిస్తాన్ గురించే మాట్లాడుకునే వారని, సినిమాలు, వార్తలు అన్ని వారి గురించే వచ్చేవని అన్నాడు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక పాకిస్తాన్‌ను తన్నితరిమేశారని చెప్పాడు. పాక్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని వివరించాడు. ఒకప్పుడు భారత్, పాక్ కరెన్సీ విలువలు సమానంగా ఉండేవని, ఇప్పుడు పాక్ కరెన్సీ విలువ భారత్‌తో పోల్చితే దారుణంగా క్షీణించిందని తెలిపాడు. అలాగే, ప్రపంచంలో అత్యంత చెత్త పాస్‌పోర్టు పాకిస్తాన్‌దే అని చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే పాకిస్తాన్ అనే వారని, ఇప్పుడు ఎందుకు అనటం లేదని ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రధాన శత్రువు భారత్ కాదని, భారత్‌కు ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుందన్నారు.

Next Story