వాటెన్ ఐడియా సర్‌జీ.. ఇలాంటి రెయిన్‌కోట్‌ను చూస్తే బ్రాండ్‌లు తల దించుకోవాల్సిందే!

by Yella Dhawani Reddy |

గత వారం రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

వాటెన్ ఐడియా సర్‌జీ.. ఇలాంటి రెయిన్‌కోట్‌ను చూస్తే బ్రాండ్‌లు తల దించుకోవాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్: గత వారం రోజులుగా వాతావరణంలో (Weather) అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం పూట ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం కాగానే వర్షాలు (Rains) ముంచెత్తున్నాయి. ఇక బుధవారం మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని (Telugu states) పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వర్షం సమాచారం కాసేపు పక్కన పెడితే సోషల్ మీడియాలో ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయంటూ రకరకాల ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు వర్షం పడదనుకున్నాడేమో రెయిన్‌కోట్ ధరించకుండా వచ్చేశాడు. కానీ ఒక్కసారిగా వాన కురవటం ప్రారంభమైంది. ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వర్షంలో తడవకుండా ఉండేందుకు వేరే లెవెల్‌లో థింక్ చేశాడు. ఒక పెద్ద పాలిథిన్ కవర్‌ను కట్ చేసి రెయిన్‌కోట్‌గా ధరించి, హ్యాపీగా వర్షాన్ని లెక్కచేయకుండా వెళ్లిపోయాడు. ఇక రోడ్డుపై ఇతర వాహనదారులు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇక ఈ ఫొటోకు 'అరెరె! రైన్‌కోట్ మర్చిపోయాను కదా, సరే ఈ ప్లాస్టిక్ కవర్‌తోనే సరిపెట్టేస్తా!' అని కొందరు, 'ఇది నా కొత్త ఫ్యాషన్ స్టైల్.. ఎలా ఉంది?' అంటూ మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు.

Next Story