- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News : సమాధి తవ్వి అస్థిపంజరంతో సెల్ఫీ.. ఉతికి ఆరేసిన ఊరి జనం
తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయిన ఓ యువకుడిని ఊరు ఊరంతా కలిసి ఉతికి ఆరేసింది.

దిశ, వెబ్ డెస్క్ : తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయిన ఓ యువకుడిని ఊరు ఊరంతా కలిసి ఉతికి ఆరేసింది. మద్యం మత్తులో సమాధిని తవ్వి(Exhumes Grave), అందులో అస్థిపంజరంతో సెల్ఫీ(Selfy with Skeleton) దిగగా.. అది చూసిన జనం అతనికి దేహశుద్ధి చేసి వదిలారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్(West Bengal) లోని ఈస్ట్ మేదినీపూర్(East Medinipur) లో కాంతి అనే గ్రామానికి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో సమాధిని తవ్వాడు. అందులో 7 ఏళ్ల కింద పూడ్చిపెట్టిన ఓ మహిళ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్నాడు.
దీనిని గమనించిన గ్రామస్తులు అతడిని పట్టుకొని తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుణ్ణి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కోపంతో ఊగిపోతున్న గ్రామస్తులు అతడిని అప్పగించేది లేదని పోలీసులపైకి కూడా రాళ్ళు విసరగా.. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దాదాపు 3 గంటల తర్వాత పరిస్థితిని అదుపులోకి తెచ్చిన ఉన్నతాధికారులు.. ఆ యువకుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.






