ఇంటిపై కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Kema Shiva Kumar |

ఓ ఇంటిపై వాటర్ ట్యాంక్ (Water Tank) కుప్పకూలిన ఘటన తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని కరూర్ (Karur) కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఇంటిపై కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఓ ఇంటిపై వాటర్ ట్యాంక్ (Water Tank) కుప్పకూలిన ఘటన తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని కరూర్ (Karur) కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 15వ వార్డులో శిథిలావస్థకు చేరిన పాత తాగునీటి నిల్వ ట్యాంక్‌ను అధికారులు కూల్చివేయాలని నిర్ణయించారు. అయితే, డిటోనేటర్లు పెట్టి ట్యాంక్‌ను కూల్చివేయగా ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న ఇంటిపై కుప్పకూలింది. అదృష్టవశాత్తు, ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఇలాంటి పాత నిర్మాణాలను కూల్చేటప్పుడు తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. స్థానిక అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story