- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: రోబో కుక్కల డ్యాన్స్ అదిరిందిగా.. టెక్నాలజీని సాంప్రదాయాన్ని మిక్స్ చేయటం అంటే ఇదే!
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే (International Workers' Day) వేడుకలు చైనాలో అత్యంత ఘనంగా నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: నేటి రోజుల్లో కాలంతో పాటు టెక్నాలజీ విపరీతంగా మారిపోతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగ ప్రవేశం తర్వాత మన జీవితాలన్నీ డిజిటల్ (Digital) రూపాన్ని సంతరించుకుంటున్నాయి. అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో విద్య, వైద్యం, రవాణా, వ్యవసాయం, సమాచార, రక్షణ, వినోదం AI తన ప్రభావాన్ని చూపుతోంది. ఇక ఇప్పటి వరకు మనకు నడవటం, కూర్చోవటం, నిలబడటం వంటి పనులు చేసే రోబోలను (Robot) చూశాం. ఇటీవల చైనాలో (Chaina) మారథాన్‌లో రోబోలు పాల్గొని అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఇక తాజాగా వాటికి మించిన రోబోలు వచ్చేశాయి. చైనా సంస్కృతిలో కూడా AI ఆధారిత రోబోలు కొత్త ప్రదర్శనలతో ఆకర్షించాయి. ఈ వినూత్న ప్రయోగానికి మే డే వేడుకలు వేదికగా నిలిచాయి.
మే 1వ తేదీ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (International Workers' Day) సందర్భంగా చైనాలో అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలోని షాన్హైగువాన్ వద్ద సాంప్రదాయ కళలు, నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ సింహ నృత్యాన్ని ఆధునిక టెక్నాలజీతో కలిపిన వినూత్న ప్రదర్శన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో డాగ్ రోబోలు సింహాల వేషధారణలో నృత్యం చేస్తూ అబ్బురపరిచాయి. ఇక ఈ ప్రదర్శన సాంప్రదాయ కళలతో ఆధునిక సాంకేతికతను సమ్మిళితం చేయడం ద్వారా, సంస్కృతి పరిరక్షణకు కొత్త దారులు చూపిస్తుంది. ఇది సాంప్రదాయ నృత్యాలను కొత్త తరాలకు పరిచయం చేయడంలో, అలాగే సాంకేతికతను సృజనాత్మకంగా ఉపయోగించడంలో ఒక మంచి ఉదాహరణగా భావించవచ్చు. ప్రస్తుతం ఈ రోబో డాగ్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.






