విరాట్ కోహ్లీ టెన్త్ క్లాస్ మార్క్స్ షీట్ వైరల్.. ఇంగ్లీష్‌లో ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా??

by Sujitha Rachapalli |

క్రికెటర్ విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కులు వైరల్ అవుతున్నాయి. సీబీఎస్ఈ 2025 టెన్త్ రిజల్ట్ రిలీజ్ కాగా కోహ్లీ పాత మార్క్స్ షీట్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

విరాట్ కోహ్లీ టెన్త్ క్లాస్ మార్క్స్ షీట్ వైరల్.. ఇంగ్లీష్‌లో ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా??
X

దిశ, ఫీచర్స్ : క్రికెటర్ విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కులు వైరల్ అవుతున్నాయి. సీబీఎస్ఈ 2025 టెన్త్ రిజల్ట్ రిలీజ్ కాగా కోహ్లీ పాత మార్క్స్ షీట్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఇంగ్లీష్, సోషల్‌లో మంచి మార్కులు సంపాదించిన కోహ్లీ.. మ్యాథ్స్, సైన్స్‌లో మాత్రం సీ గ్రేడ్ పొందాడు. మార్కులు లైఫ్‌ను డిసైడ్ చేయవని.. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించాలనే ఈ పోస్ట్ పెట్టిన ఆఫీసర్.. డెడికేషన్, పాషన్ మాత్రమే మన సక్సెస్‌ను డిఫైన్ చేయగలదని చెప్తున్నాడు. మార్కులు తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకోవడం సరైన నిర్ణయం కాదని సూచించాడు.

ఇక నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2004లో 69శాతం మార్కులు పొందాడంటే గ్రేట్ అంటున్నారు అభిమానులు. మార్కులదేముంది బ్రో.. సరైన లక్ష్యం ఉంటే చదువు అవసరం లేదని ఇంకొందరు చెప్తున్నారు. చదువుకున్నోళ్లు టీచర్ అయితే చదువుకోనోళ్లు స్కూల్స్ పెట్టినట్లుంది పరిస్థితి అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కోహ్లీ ఈ రేంజ్‌కు ఎదగడం నిజంగా ఈ జనరేషన్‌కు మంచి ఇన్‌స్పిరేషనల్ స్టోరీ అవుతుంది.

Next Story