VIRAL: నువ్వొక థర్డ్ రేట్ రిపోర్టర్.. యాంకర్‌పై డొనాల్డ్ ట్రంప్ చిందులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-08 05:09:14  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్‌పై ఫైర్ అయ్యారు.

VIRAL: నువ్వొక థర్డ్ రేట్ రిపోర్టర్.. యాంకర్‌పై డొనాల్డ్ ట్రంప్ చిందులు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి మీడియాపై చిందులుతొక్కారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్‌బీసీ (NBC)కి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ (Kristen Welker) అడిగిన ప్రశ్నలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇంటర్వ్యూను మధ్యలోనే ముగించి, అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్లిపోయారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా.. గత 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయంటూ ట్రంప్ మరోసారి పాత వాదనను తెరపైకి తెచ్చారు. అయితే, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనడానికి ఎలాంటి ప్రూఫ్‌లు లేవని, కోర్టులు కూడా ఆ వాదనను కొట్టిపడేశామని యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ కామెంట్ చేశారు. దీంతో ట్రంప్‌నకు చిర్రెత్తి కెమెరా ఎదుటే లైవ్‌లో మాట జారారు. యాంకర్‌‌ను ఉద్దేశించి ‘నువ్వొక థర్డ్ రేట్ రిపోర్టర్.. నీకు ఇంటర్వ్యూ చేయడం చేతకాదు’ అంటూ ఫైర్ అయ్యారు. అనంతరం ట్రంప్‌ తన సూట్‌కు ఉన్న మైక్ రిమూవ్ చేసి ఇంటర్వ్యూ నుంచి వాకౌట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

వైట్‌హౌస్.. అన్‌కట్ వీడియో రిలీజ్

తాజాగా ఎన్‌బీసీ ఇంటర్వ్యూ వివాదం అమెరికా పాలిటిక్స్‌లో దుమారం రేపుతోంది. ఇంటర్వ్యూలో ఏం జరిగింది, ఎన్‌బీసీ యాంకర్ ఏ విధంగా ప్రవర్తించిందో ప్రజలకు చూపించడానికి వైట్‌హౌస్ సిబ్బంది స్వయంగా రికార్డ్ చేసిన పూర్తి అన్‌కట్ (Uncut) ఆడియో, వీడియో ఫుటేజీని అధికారికంగా సోషల్ మీడియాలో విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story