- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: రైలు కింద పడుకుని యువకుడి రీల్స్.. సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!
సోషల్ మీడియా (Social Media)లో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించాలనే తాపత్రయం యువతను పెడదారి పట్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా (Social Media)లో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించాలనే తాపత్రయం యువతను పెడదారి పట్టిస్తోంది. వ్యూస్, లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెడుతూ ప్రమాదకరమైన విన్యాసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకుని, రైలు తనపై నుంచి వెళ్తుండగా వీడియో తీసుకున్న ఘటన నెట్టింట కలకలం రేపుతోంది. ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మానసిక రోగులకు కౌన్సిలింగ్ అవసరం..
పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే..! సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు. ఒక్క సెకను తేడా జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని కూడా ఆలోచించడం లేదు. ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ప్రమాదం జరిగి ప్రాణం పోతే, ఆ కుటుంబం అనుభవించే బాధ వర్ణనాతీతమని సజ్జనార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
అయితే, ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు రైల్వే ట్రాక్ మధ్యలో బోర్లా పడుకుని ఉంటాడు. రైలు వేగంగా వస్తున్నా సరే ఏమాత్రం భయం లేకుండా అలాగే ఉంటాడు. వేగంగా వచ్చిన రైలు అతడిపై నుంచి దూసుకెళ్లిపోయిన తర్వాత, ఆ యువకుడు ఏమీ జరగనట్లుగా నవ్వుతూ పైకి లేచాడు. చేసింది తప్పని చెప్పాల్సిన స్నేహితులు వీడియో తీస్తూ ప్రోత్సహించడం గమనార్హం.






