- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: మైనస్ డిగ్రీల చలిలో యోగాసనాలు.. ITBP బెటాలియన్ జవాన్ల సాహసం
లద్దాఖ్‌లోని మైనస్ డిగ్రీల చలిలో పాంగాంగ్ త్సో సరస్సు తీరంలో ఐటీబీపీ (ITBP) జవాన్లు అద్భుత యోగాసనాలు వేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. సామాన్య ప్రజల నుంచి దేశాన్ని కాపాడే సైనికుల వరకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాలుపంచుకుంటున్నారు. లద్దాఖ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉప్పునీటి సరస్సు పాంగాంగ్ త్సో (Pangong Tso) తీరంలో గడ్డకట్టే చలిని లెక్క చేయకుండా 47వ ఐటీబీపీ (ITBP) బెటాలియన్ జవాన్లు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ, మంచు కొండల మధ్య జవాన్లు అత్యంత కఠినమైన యోగాసనాలను అలవోకగా వేసి తమ శారీరక, మానసిక దృఢత్వాన్ని చాటుకున్నారు. అదేవిధంగా లద్దాఖ్‌లోని వ్యూహాత్మక లుకుంగ్ పోస్ట్ వద్ద 24వ బెటాలియన్ జవాన్లు కూడా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటారు.
సముద్ర గర్భంలో వినూత్నంగా..
మరోవైపు, దేశ సముద్ర సరిహద్దులను కాపాడే ఇండియన్ నేవీ (Indian Navy) వీరులు సరికొత్త రీతిలో యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. నీటి అడుగున, సముద్ర గర్భంలో ప్రయాణించే జలాంతర్గాములపై (Submarines) సబ్‌మెరైనర్లు వినూత్నంగా యోగాసనాలు వేశారు. బాహ్య ప్రపంచానికి దూరంగా, కఠినమైన పరిస్థితుల్లో పనిచేసే నేవీ సిబ్బంది.. తమ మానసిక ప్రశాంతత కోసం, శారీరక ఫిట్‌నెస్ కోసం యోగాను ఎలా ఉపయోగించుకుంటున్నారో ఈ సందర్భంగా చేసి చూపించారు.






