- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIT: సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ (Sai Krishna) మిస్సింగ్ కేసు దర్యాప్తుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మిస్టరీని త్వరితగతిన ఛేదించేందుకు గానూ ఓ ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఉన్న ప్రాధాన్యత, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యున్నత పోలీస్ అధికారులతో ఈ ‘సిట్’ బృందాన్ని తయారు చేశారు.
సిట్ చీఫ్‌గా ఐజీ రవిప్రకాశ్..
సాయికృష్ణ మిస్సింగ్ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బృందానికి (SIT) చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ రవిప్రకాశ్ (IG Ravi Prakash)ను నియమించారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ కేసు విచారణ మొత్తం సాగనుంది. ఆయనతో పాటు ఈ సిట్ బృందంలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన మరికొంతమంది కీలక పోలీస్ అధికారులను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. అందులో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్ ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నతాధికారులు సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాశ్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. సాంకేతిక ఆధారాలు, పాత రికార్డులు, అన్ని కోణాలను విశ్లేషించి సాయికృష్ణ మిస్సింగ్‌కు గల అసలు కారణాలను ఈ బృందం త్వరలోనే తేల్చనుంది.






