- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం.. కోదాడ పోలీసుల సందేశం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణ పోలీసు స్టేషన్ ఆవరణలో ఆదివారం పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

దిశ, కోదాడ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణ పోలీసు స్టేషన్ ఆవరణలో ఆదివారం పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అత్యంత అవసరమనే సందేశాన్ని ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు చేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే జీవన విధానమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐలు మాట్లాడుతూ.. నేటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ యోగా సాధన చేయడం అవసరమన్నారు. యోగా ద్వారా శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతత లభిస్తాయని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన వారు, ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఉత్తమ మార్గమని అన్నారు. యోగా ద్వారా సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంతో పాటు సానుకూల ఆలోచనలు కూడా పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐలు సుధీర్ కుమార్, రూరల్ ఎస్ఐ ఉపేందర్ రెడ్డి, ఎస్ఐ చిన్న మల్సూర్, ట్రాఫిక్ ఎస్ఐ బైరెడ్డి అంజిరెడ్డి, షీ టీమ్ ఎస్ఐ మల్లేష్‌తో పాటు టౌన్, రూరల్, ట్రాఫిక్, షీ టీమ్ పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






