పెనగడపలో దారుణం.. హత్యకు దారి తీసిన 'మూఢనమ్మకం'

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-21 07:44:55  IST  )

మారుతున్న కాలా అనుగుణంగా సాంకేతిక రంగం మరింత అభివృద్ధి చెందుతుంది.

పెనగడపలో దారుణం.. హత్యకు దారి తీసిన మూఢనమ్మకం
X

దిశ, చుంచుపల్లి: మారుతున్న కాలా అనుగుణంగా సాంకేతిక రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కానీ మనుషుల్లో ఉన్న మూఢ నమ్మకం మారడం లేదని ఆదివారం జరిగిన సంఘటన రుజువు చేసింది. చేతబడి చేస్తున్నాడని అనుమానంతో ఓ మనిషి గొంతు కోసి హత్య చేసే స్థాయికి చేరుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం టూ టౌన్ పరిధిలోని పెనగడప గ్రామంలో నివాసం ఉంటున్న శివాజీకి ఇద్దరు పిల్లలు.

తన పిల్లలకు తరచూ అనారోగ్య సమస్యలు రావడం ఇంట్లో ఏదో ఒక సమస్య ఉండటంతో తన ఇంటి పక్కన నివాసం ఉంటున్న నాగరాజు అనే వ్యక్తి చేతబడి చేయిస్తున్నాడని అనుమానం మరింతగా బలపడింది. నాగరాజు కారణంగానే తన కుటుంబంలో సమస్యలు వస్తున్నాయని ఎలాగైనా తన అడ్డు తొలగించుకోవాలని భావించిన శివాజీ సదరు వ్యక్తి గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. వెంటనే నిందితుడు టూ టౌన్ పోలీసుల ఎదుట తాను చేసిన నేరాన్ని ఒప్పుకొని లొంగిపోయాడు. ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సాంకేతిక రంగం ఉరకలు వేస్తుంటే ఇంకా చేతబడి అంటూ అనుమానంతో ఎలాంటి దారుణాలు ఎక్కడో చోట జరగడం సర్వసాధారణమై పోయింది. వెంటనే 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Next Story