భారత్‌లో రీఎంట్రీ ఇచ్చిన కరోనా మహమ్మారి.. ఆ నగరంలో పెరుగుతున్న కేసులు

by Ajay Maddhiboyina |

భారత్‌లో వేల మందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి రీఎంట్రీ ఇచ్చింది. ముంబాయిలో గత వారం రోజులుగా కోవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.

భారత్‌లో రీఎంట్రీ ఇచ్చిన కరోనా మహమ్మారి.. ఆ నగరంలో పెరుగుతున్న కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్‌లో వేల మందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి రీఎంట్రీ ఇచ్చింది. ముంబాయిలో గత వారం రోజులుగా కోవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే వైరల్ ఇన్ఫెక్ష‌న్‌లు పెరగటం సాధారణం. కానీ వర్షాకాలం వచ్చే ముందే ముంబాయిలో వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే నగరంలో స్వైన్ ఫ్లూ, ఇన్ ఫ్లూయెంజా, కరోనా కేసులు నమోదైనట్టు ముంబాయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలోని ఫాథాలజీ వైద్యుడు డాక్టర్ సంజయ్ మెహతా వెల్లడించారు.

ప్రస్తుతం తమ ప్రయోగశాలలో ప్రతిరోజు ఏడు కోవిడ్ లేదా స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. నెలరోజుల క్రితం వరకు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయయని, వారం రోజులుగా కోవిడ్ కేసులు వస్తున్నాయని తెలిపారు. శనివారం బ్రీచ్ క్యాండీ, బాటియా ఆస్పత్రుల్లో ఒక్కో కోవిడ్ రోగి అడ్మిట్ అయినట్టు చెప్పారు. రోగులు అధిక జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రికి వస్తున్నారని తెలిపారు. వాతావరణంలో తేమస్థాయి పెరగటంతో వైరస్ లు విజృంభిస్తున్నాయ‌ని అన్నారు. ప్ర‌స్తుతం వ‌స్తున్న కోవిడ్ కేసులు అంత తీవ్ర‌మైన‌వి కాన‌ప్ప‌టికీ వృద్ధులు, చిన్న‌పిల్ల‌లు, గ‌ర్భిణులు, శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

Next Story