- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిఘా నీడలో నీట్ రీఎగ్జామ్ ప్రారంభం.. రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ బృందాలు
దేశవ్యాప్తంగా 551 నగరాల్లోని 5,440 కేంద్రాల్లో నీట్ యూజీ రీఎగ్జామ్ ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG 2026) రీఎగ్జామ్ ప్రక్రియ అత్యంత భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా ఎగ్జామ్‌కు దేశ, విదేశాల నుంచి అభ్యర్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గతంలో ప్రశ్న పత్రాల లీకేజీ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్టీఏ (NTA) సర్వసన్నద్ధమైంది. ఈ ఏడాది నీట్ యూజీ రీఎగ్జామ్‌ను దేశంలోని 551 ప్రధాన నగరాల్లోని 5,440 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. వీటితో పాటు విదేశాల్లోని మరో 14 ప్రత్యేక కేంద్రాల్లో కూడా ఈ పరీక్ష జరుగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 22.79 లక్షలకు పైగా మంది విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఎన్టీఏ పరీక్ష సమయాలను కేటాయించింది. సాధారణ అభ్యర్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ఇక దివ్యాంగులైన అభ్యర్థులకు సాయంత్రం 6.20 గంటల వరకు పరీక్ష రాయనివ్వనున్నారు.
రంగంలోకి ఇంటెలిజెన్స్..
నీట్ (యూజీ) పేపర్ లీకేజీలు, మాల్‌ప్రాక్టీస్ వంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పోలీసులు, భద్రతా విభాగాలు గట్టి చర్యలు చేపట్టాయి. పరీక్ష కేంద్రాల వద్ద స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్లు (Local Intelligence Units), క్రిమినల్ ఇంటెలిజెన్స్ బృందాలను రంగంలోకి దించి అప్రమత్తం చేశారు. నీట్ పరీక్షకు సంబంధించి లీకేజీలంటూ తప్పుడు సమాచారాన్ని, ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేసే వారిని గుర్తించి, వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తీవ్రంగా హెచ్చరించారు.






