బిగ్ బాస్ 10లోకి లేడీ జబర్దస్త్ కమెడియన్?

by Pulgam srinivas |

బిగ్ బాస్ తెలుగు 10లో జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర పాల్గొననున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ 10లోకి లేడీ జబర్దస్త్ కమెడియన్?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటివరకు ఈ షో తెలుగులో బుల్లితెరపై తొమ్మిది సీజన్లను, ఓటీటీలో ఒక సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 10 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా కొంతమంది సామాన్యులకు షోలో పాల్గొనే అవకాశం కల్పించింది బిగ్ బాస్ యాజమాన్యం. అందుకోసం ప్రత్యేకంగా 'అగ్నిపరీక్ష' నిర్వహించనుంది.

ఇందులో విజయం సాధించిన వారికి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ లభించే అవకాశం ఉంటుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 10లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా మరో పేరు చేరింది. ఆమె మరెవరో కాదు జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర, ఈటీవీలో ప్రసారమైన పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పటికే బుల్లితెరపై మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న పవిత్ర బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే, ఆమెకు ఈ షో కెరీర్ పరంగా మరింత ఉపయోగపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆమె ఎంట్రీపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Next Story