- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబు నవ యువకుడు : కేంద్రమంత్రి రామ్మోహన్
సీఎం చంద్రబాబునాయుడికి ముసలితనమే లేదని, రాష్ట్రం కోసం నవయువకుడిలా పనిచేస్తున్నారని కొనియాడారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబునాయుడికి ముసలితనమే లేదని, రాష్ట్రం కోసం నవయువకుడిలా పనిచేస్తున్నారని కొనియాడారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం రెండేళ్లపాలన విజయోత్సవ సభలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలంతా ప్రజలకు సేవ చేసేందుకు అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు యువకుడిలా శ్రమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం అందరం కలిసి పనిచేస్తామని, రాష్ట్ర అభివృద్ధి కోసం మరో 30 సంవత్సరాలు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండేలా ప్రజలు సపోర్ట్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రం కోసం నేను కష్టపడతాను అంటూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడుతున్నారని, ప్రజల కోసం ఆయన నిజమైన నాయకుడు అయ్యారని కొనియాడారు. ఎలాగైనా రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్నదే సీఎం నిరంతర ఆలోచన అని స్పష్టం చేశారు.






