పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్న వివేక్ ఆత్రేయ.. అప్పటి నుంచే రవితేజతో సినిమా

by Pulgam srinivas |

రవితేజ - వివేక్ ఆత్రేయ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను అక్టోబర్ నెల నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్న వివేక్ ఆత్రేయ.. అప్పటి నుంచే రవితేజతో సినిమా
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ దర్శకుల్లో వివేక్ ఆత్రేయ ఒకరు. ఆయన చివరగా దర్శకత్వం వహించిన సరిపోదా శనివారం చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి విజయాన్ని కూడా అందుకుంది. కొంతకాలం క్రితం వివేక్ ఆత్రేయ, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారని, రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అనంతరం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో వివేక్ ఆత్రేయతో చేయాల్సిన ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా ప్రారంభమయ్యేలోపు వివేక్ ఆత్రేయ, మాస్ మహారాజా రవితేజతో ఓ సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడిచింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను అక్టోబర్ నెల నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు సమాచారం. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Next Story