రియల్ ఎస్టేట్ కలిసిరాక.. అప్పుల ఊబిలో కూరుకుపోయి వ్యక్తి బలవన్మరణం

by Jakkula.Mamatha |

అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దోమ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

రియల్ ఎస్టేట్ కలిసిరాక.. అప్పుల ఊబిలో కూరుకుపోయి వ్యక్తి బలవన్మరణం
X

దిశ, దోమ: అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దోమ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండల పరిధిలోని దొంగ ఎన్కేపల్లి గ్రామానికి చెందిన శేరి రాంరెడ్డి(46), అశ్విని భార్యభర్తలు. వీరు కొన్ని రోజులుగా వారి అత్తగారి ఇళ్లు పూడూర్ మండలంలో ఉంటున్నారు. శేరి రాంరెడ్డి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకొని గ్రామానికి చెందిన బిజ్జి పద్మ, వసీమ్, హరిజన్ రాజు, అజీమ్, మోసీన్, సల్మాన్ ఖాన్ తో కలిపి అప్పు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగం కుదుట పడకపోవడంతో అప్పు కాస్త మిత్తిలతో పెరిగిపోయింది. ఈ క్రమంలో వారికి సమయానికి డబ్బులు చెల్లించకపోవడం, వారు పదే పదే డబ్బు గురించి వేధించడంతో సల్మాన్ ఖాన్ పేరుపైన తనకున్న రెండెకరాల 14 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. అయినా మిగిలిన డబ్బులు ఇవ్వాలని టార్చర్ చేయడంతో వారి బాధను తట్టుకోలేక రాంరెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అశ్విని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story