- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్.. మెట్రో, రైల్వే అంశాలపై కేంద్రంతో చర్చలు!
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు, రైల్వే పెండింగ్ అంశాలపై కేంద్రంతో తేల్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన మెట్రో విస్తరణ, రైల్వే పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించి, సమస్యలను తేల్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఆయన రాబోయే రెండు రోజుల పాటు హస్తినలోనే పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే టార్గెట్‌గా కేంద్రం నుంచి నిధులు, అనుమతుల సాధన కోసం సీఎం ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే, టూర్‌కు ముందే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక లేఖ రాశారు. ఈనెల 22, 23 తేదీల్లో తాను ఢిల్లీలోనే అందుబాటులో ఉంటానని లేఖలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై చర్చించేందుకు కేంద్ర రైల్వే మంత్రితో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయించాలని, అందుకు కిషన్ రెడ్డి చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
IRFC ఫైనాన్సింగే ప్రధాన అజెండా..
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌లో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు (Hyderabad Metro Rail Project) ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన నిధుల కొరతపై చర్చించనున్నారు. అదేవిధంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) ఫైనాన్సింగ్ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. మెట్రో ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వివిధ రైల్వే లైన్ల విస్తరణ, కొత్త రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై పూర్తి వివరాలతో కూడిన రిపోర్టును సీఎం రేవంత్, కేంద్ర మంత్రులకు అందజేయబోతున్నట్లుగా తెలుస్తోంది.






