తిరుమలలో తగ్గని రద్దీ.. దర్శనానికి ఎన్నిగంటలు పడుతుందంటే?

by Ajay Maddhiboyina |

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం టోకెన్లు లేని భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నానికి 15 గంట‌ల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతోంది. శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోర‌ణం క్యూలైన్ వ‌ర‌కు భ‌క్తులు వేచి ఉన్నారు.

తిరుమలలో తగ్గని రద్దీ.. దర్శనానికి ఎన్నిగంటలు పడుతుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం టోకెన్లు లేని భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నానికి 15 గంట‌ల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతోంది. శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోర‌ణం క్యూలైన్ వ‌ర‌కు భ‌క్తులు వేచి ఉన్నారు. ఇక ఈరోజు పలువురు సెలబ్రెటీలు శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీస్ టీంతో కలిసి తిరుమలకు వచ్చారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షాజ్ఞ సైతం స్వామివారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. శ‌నివారం 93,303 మంది భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. శ‌నివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు వ‌చ్చింది. 41,688 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. అంతే కాకుండా నిన్న 4.58 ల‌క్ష‌ల ల‌డ్డు ప్ర‌సాదాల విక్ర‌యాలు జ‌రిగాయి.

Next Story