- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెప్మా నిధుల అక్రమ వినియోగంపై కలెక్టర్ కఠిన చర్యలు
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా విభాగానికి చెందిన కొన్ని స్లమ్ లెవెల్ ఫెడరేషన్లు, స్వయం సహాయక సంఘాల్లో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ నిర్వహించినట్లు మెప్మా జిల్లా కార్యాలయం వెల్లడించింది.

దిశ, కోదాడ: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా విభాగానికి చెందిన కొన్ని స్లమ్ లెవెల్ ఫెడరేషన్లు, స్వయం సహాయక సంఘాల్లో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ నిర్వహించినట్లు మెప్మా జిల్లా కార్యాలయం వెల్లడించింది. విచారణలో లెక్కల పుస్తకాలు, బ్యాంకు ఖాతాల లావాదేవీలు, సమావేశాల తీర్మానాలు, రుణ పంపిణీ వివరాలు, సభ్యుల వాంగ్మూలాలు తదితర రికార్డులను పరిశీలించగా సమాఖ్య నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో నిధుల పరిరక్షణ, బాధ్యులపై చర్యలు, సభ్యుల విశ్వాస పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.సనా, దుర్గ భవాని స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన రుణ నగదును నిబంధనలకు విరుద్ధంగా వినియోగించిన వారిపై పోలీసు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే సంబంధిత మొత్తాల రికవరీకి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.. ప్రజా ధనం, సంఘాల నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో కూడా ఇటువంటి ఫిర్యాదులపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.






