ఫేమస్ అవుతున్న మరో పూసలమ్మే యువతి.. నెటిజన్లు ఫిదా!

by Ajay Maddhiboyina |

అప్పట్లో కుంభమేళాలో ఓ పూసలమ్మే అమ్మాయి తన అందంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆ అమ్మాయిని మోనాలిసా అంటూ సోషల్ మీడియా కీర్తించింది. దాంతో పూసలమ్మే అమ్మాయి కాస్తా సినిమా హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది.

ఫేమస్ అవుతున్న మరో పూసలమ్మే యువతి.. నెటిజన్లు ఫిదా!
X

దిశ, వెబ్ డెస్క్: అప్పట్లో కుంభమేళాలో ఓ పూసలమ్మే అమ్మాయి తన అందంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆ అమ్మాయిని మోనాలిసా అంటూ సోషల్ మీడియా కీర్తించింది. దాంతో పూసలమ్మే అమ్మాయి కాస్తా సినిమా హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది. ఇప్పుడు 18ఏళ్లు కూడా నిండకుండానే ప్రేమవివాహం చేసుకుని వార్తల్లో నిలుస్తోంది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మరో పూసలమ్మే అమ్మాయి కూడా ఫేమస్ అవుతోంది. అయితే ఈ అమ్మాయి ఫేమస్ అవుతోంది అందంతో కాదు.. తన టాలెంట్‌తో. సాధారణంగా పూసలు అమ్మే అమ్మాయి అంటే పెద్దగా చదువుకుని ఉండదు కాబట్టి వాళ్ల భాష తప్ప మరొకటి మాట్లాడలేదు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంగ్లీష్ లో అదరగొడుతూ నెటిజన్ల అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది.

ఢిల్లీకి చెందిన ఆ అమ్మాయిని ఓ విదేశీయ యూట్యూబర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. గతంలోనూ అదే అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడుతున్న వీడియోను ఆయనే షేర్ చేయగా వైరల్ అవ్వగా ఇప్పుడు మరోసారి ఆయన ఢిల్లీకి రావడంతో గుర్తు పట్టి మరీ మాట్లాడించింది. విదేశీయుడు ఇంగ్లీష్ లో మాట్లాడగా యువతి కూడా ఎక్కడా తడబకుండా ఇంగ్లీష్ లో అదరగొట్టింది. అంతే కాకుండా చాలా చక్కగా సమాధానాలు ఇస్తూ అతడిని ఆకట్టుకుంది. దీంతో ఆ యూట్యూబర్ ఆమె మాటతీరు, ఇంగ్లీష్ చక్కగా మాట్లడటంపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు సైతం యవతి ఇంగ్లీష్ కు ఫిదా అవుతున్నారు.

Next Story