టేకు చెట్ల నరికివేత.. సింగారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్?

by Jakkula.Mamatha |

మండలంలోని సింగారం ఎమ్‌పియుపిఎస్ పాఠశాల ప్రధానోపాద్యాయుడు మాలోత్ శంకర్ సంబంధిత శాఖల అధికారుల అనుమతి లేకుండా.. ఈనెల 17న పాఠశాల ఆవరణలో ఉన్న మూడు టేకు చెట్లు నరికి వేసి, కార్పెంటర్ ఇంటికి తరలించడంతో, విషయం వెలుగులోకి వచ్చింది.

టేకు చెట్ల నరికివేత.. సింగారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్?
X

దిశ, బయ్యారం: మండలంలోని సింగారం ఎమ్‌పియుపిఎస్ పాఠశాల ప్రధానోపాద్యాయుడు మాలోత్ శంకర్ సంబంధిత శాఖల అధికారుల అనుమతి లేకుండా.. ఈనెల 17న పాఠశాల ఆవరణలో ఉన్న మూడు టేకు చెట్లు నరికి వేసి, కార్పెంటర్ ఇంటికి తరలించడంతో, విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బయ్యారం ఫారెస్ట్ రేంజ్ అధికారి రవికిరణ్‌కు విషయం తెలిసి 0.487 సిఎమ్ టి టేకు కలపను స్వాధీనం చేసుకొని దాని విలువ రూ.54,453 గా నిర్ధారణ చేసి కేసు నమోదు చేసి కలపను డిపోకు తరలించారు. దీనిపై సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మూర్తి సమగ్ర విచారణ చేసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీషకు ఈనెల 19న నివేదిక పంపారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పై డిఇఓ సస్పెండ్ వేటు వేసినట్లు తెలుస్తోంది. సస్పెండ్ ఉత్తర్వులను ప్రధానోపాధ్యాయుడికి పంపినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story