Viral: ఇది చూసి మస్క్ ఏమైపోతాడో..? నెట్టింట వైరల్ గా మారిన సైబర్ ట్రక్ డూప్

by Ramesh Goud |
Viral: ఇది చూసి మస్క్ ఏమైపోతాడో..? నెట్టింట వైరల్ గా మారిన సైబర్ ట్రక్ డూప్
X

దిశ, వెబ్ డెస్క్: ఎలాన్ మస్క్(Elone Musk) కంపెనీ టెస్లా(Tesla)కు చెందిన సైబర్ ట్రక్(Cyber Truck) పాకిస్థాన్(Pakisthan) వీధుల్లో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) గా మారింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా నుంచి రిలీజైన సైబర్ ట్రక్ గురించి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు టెస్లా సైబర్ ట్రక్ అని మస్క్ ప్రకటించుకున్నాడు. అయితే ఆ కారుపై ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ కొనుగోలు చేసే స్తోమత అందరికీ ఉండదు. దీంతో చేసేదేమీ లేక పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి సైబర్ ట్రక్‌‌కు డూప్ ను తయారు చేసి, అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇది చూసిన వారు సైబర్ ట్రక్ నే కొని తెచ్చాడా అన్నట్లు విస్తుపోతున్నారు. ఇది పాకిస్థాన్ వీధుల్లో తిరుగుతున్న దృష్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఈ ట్రక్‌ను చూస్తే మస్క్ షాక్ అవుతాడని, పనిలో పని రాకెట్ కూడా తయారు చేసి పంపించక పోయారా అని పన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed