VIRAL: వార్డు మెంబర్ అభ్యర్థి బంపరాఫర్.. ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-04 06:55:36  IST  )

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది.

VIRAL: వార్డు మెంబర్ అభ్యర్థి బంపరాఫర్.. ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రవిచిత్రమైన హామీలు ఇస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు.తాజాగా రంగారెడ్డి జిల్లా, కొత్తపేట (Kothapet) గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి పసుల వనమ్మ నరసింహ యాదవ్‌ తమను గెలిపిస్తే.. ప్రతి ఓటరుకు రూ.5 లక్షల జీవిత బీమా చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు కనీసం రూ.42.5 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరో గ్రామంలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా.. వారి పేరిట రూ.5 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్, కూతురు పెళ్లి చేస్తే పుస్తె, మెట్టెలు ఇస్తామని బాండ్ రాసి ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో అబ్బాయి వివాహానికి రూ.5,116 ఆర్థిక సాయం, ఇంటి నిర్మాణానికి రూ.21 వేల సాయం చేస్తామని అభ్యర్థులు తాయిలాలు ప్రకటిస్తూ.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

అయితే, రోటీన్‌కు భిన్నంగా సిద్దిపేట (Siddipet) జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రఘోత్తంపల్లి (Raghothampally)లో ఇచ్చిన హామీ ఏమి క్రేజీగా ఉంది. తన భార్యను వార్డు మెంబర్‌గా గెలిపిస్తే.. తన సెలూన్ షాపులో తన వార్డు పరిధిలోని పురుష ఓటర్లందరికీ ఐదేళ్ల పాటు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తానని హామీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్త విన్న పక్క గ్రామాల ప్రజలు, ఓటర్లు “ఎవరైనా డబ్బులిస్తారు.. లేకపోతే మందు పోస్తారు.. ఇలా ఫ్రీగా కటింగ్, షేవింగ్ చేయడం ఏంటి?” అని అవాక్కవుతున్నారు.

Next Story