- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరల్ వీడియో: ‘ఎవరు తాతా నువ్వు.. బండి నాశనం, రోడ్డూ నాశనం!’ పచ్చి సీసీ రోడ్డుపై వృద్ధుడి నిర్లక్ష్యం
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని చూసినప్పుడు మాత్రం కోపం, చిరాకు రాక మానవు. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియో నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని చూసినప్పుడు మాత్రం కోపం, చిరాకు రాక మానవు. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియో నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. అప్పుడే వేసిన పచ్చి సీసీ రోడ్డుపైకి ఓ వృద్ధుడు స్కూటీని తీసుకెళ్లి, మొత్తం రోడ్డును నాశనం చేసిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఒక ప్రాంతంలో అప్పుడే కొత్తగా సీసీ (సిమెంట్) రోడ్డు వేశారు. రోడ్డు పచ్చిగా ఉండటంతో ఎవరూ వెళ్లకూడదని వదిలేశారు. కానీ, అటుగా స్కూటీపై వచ్చిన ఓ వృద్ధుడు అవేమీ పట్టించుకోకుండా నేరుగా ఆ పచ్చి సిమెంట్ రోడ్డుపైకి బండిని ఎక్కించేశాడు. బండి టైర్లు సిమెంట్‌లో లోపలికి ఇరుక్కుపోతున్నప్పటికీ ఆ తాత మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కనీసం పొరపాటున వచ్చానని గ్రహించి బండిని వెనక్కి మళ్లించకుండా.. అత్యంత నిర్లక్ష్యంగా అలాగే ముందుకు తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్కడే ఉన్న కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, అది కాస్తా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.
నెటిజన్ల రియాక్షన్ ఇదే..
ఈ వీడియో చూసిన నెటిజన్లు తాత తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోను చూసి విస్మయం వ్యక్తం చేస్తూ.. ‘ఎవరు తాతా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’ అంటూ ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు. మరో నెటిజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇబ్బంది పడటానికి ఇలాంటి వ్యక్తులే అసలు కారణం. వీళ్లే మళ్లీ తర్వాత రోడ్లు సరిగ్గా లేవని, సదుపాయాలు లేవని ప్రభుత్వాలను నిందిస్తారు’ అని ఘాటుగా కామెంట్ చేశారు. ఇంకొక నెటిజన్ ప్రాక్టికల్ విమర్శ చేస్తూ.. ‘బండి నాశనం, రోడ్డు నాశనం. అసలే వేయక వేయక వేస్తారు రోడ్లు.. తెలియక వెళ్ళిన ముసలోడు అక్కడే వెనక్కి తీసుకుంటే అయిపోయేది. కానీ మొత్తం రోడ్డును నాశనం చేసుకుంటూ పోయాడు’ అని వీడియో పోస్ట్ చేశారు.






