- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: వామ్మో.. జేసీబీనే ఎత్తి పడేసిన ఏనుగు.. ఆ తర్వాత ఏమైందంటే?
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ (వైరల్ video) అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు (ఆనిమల్ videos) సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి. అందులో కొన్ని జంతువుల ప్రవర్తనకు నవ్వు తెప్పించేలా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌గా వింతగా ఉంటాయి. తాజాగా నెట్టింట ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఇందులో ఏనుగు ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే..
ఓ బహిరంగ ప్రదేశంలో కొంత మంది జేసీబీతో పని చేయిస్తున్నారు. ఇంతలో ఓ ఏనుగు (Elephant) అక్కడికి వచ్చింది. వేగంగా పరిగెత్తుకుంటూ ఆ జేసీబీ (JCB) దగ్గరకు వచ్చి, దానిపై దాడి చేసింది. తొండంతో జేసీబీని ఎత్తి పడేసింది. అంతా పెద్ద జేసీబీ కూడా ఏనుగు బలం ముందు నిలవలేకపోయింది. ఆ ఏనుగు ప్రవర్తన చూసి అక్కడ ఉన్న వారు కూడా ఒక్కసారిగా భయాబ్రాంతులకు గురయ్యారు. వెంటనే తెరుకుని ప్రజలు కేకలు వేస్తూ ఆ ఏనుగును అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో ప్రశాంతంగా ఉండాల్సిన ఏనుగు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.






