Viral video: ఈ బామ్మ డ్యాన్స్ మాములుగా లేదుగా.. ఫిదా అవుతున్న నెటిజన్లు

by Yella Dhawani Reddy |

వృద్ధాప్యంలోకి అడుగుపెట్టామంటే.. చాలామంది శారీరకంగా, మానసికంగా బలహీనపడతారు.

Viral video: ఈ బామ్మ డ్యాన్స్ మాములుగా లేదుగా.. ఫిదా అవుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: వృద్ధాప్యంలోకి (Oldage) అడుగుపెట్టామంటే.. చాలామంది శారీరకంగా, మానసికంగా బలహీనపడతారు. ప్రతి చిన్న పనికైనా ఇతరులపై ఆధారపడుతుంటారు. కానీ ఈ ఆలోచనలకే చెక్ పెడుతూ, ఓ బామ్మ (Granny) తన జోష్‌ఫుల్ డ్యాన్స్‌తో (Dance) నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, మనసు యవ్వనంగా ఉంటే ఏవైనా సాధ్యమేనని ప్రూవ్ చేసింది. కజరారే పాటకు ఆ బామ్మ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను (Social media) షేక్ చేస్తోంది. వావ్ బామ్మ, వాట్ ఏ డ్యాన్స్..ఎంత ఎనర్జీ అంటూ నెటిజన్లు బామ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

బాలీవుడ్ మూవీ బంటీ ఔర్ బబ్లీ సినిమాలో కజరారే కజరారే పాట ఏ రేంజ్‌లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లు ముగ్గురు మాస్ స్టెప్పులతో అందరిని ఆకట్టుకున్నారు. అప్పుడే కాదు.. ఇప్పటికి ఈ సాంగ్ పండగలలో, ఫంక్షన్లలో, సంగీత కార్యక్రమాలలో తప్పనిసరిగా వినిపించే పాటగా నిలిచింది. ఈ పాటలోని ఎనర్జీ, స్టెప్పులు, మ్యూజిక్.. ఇవన్నీ కలసి ఈ సాంగ్‌ను ఎప్పటికీ మర్చిపోలేని హిట్‌గా మార్చేశాయి. అదే పాటకు తాజాగా ఓ వృద్ధ మహిళ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లిరిక్స్‌కు తగినట్లుగా హవాభావాలను పలికిస్తూ అదిరిపోయే స్టెప్పులతో నెటిజన్లను ఫిదా చేసింది. ఆమె డ్యాన్స్ చూసినవాళ్లు 'ఇది నిజంగా ఇన్‌స్పిరేషన్', 'ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్!' అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ పాటకు 5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

Next Story