- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: టామ్ క్రూజ్‌తో నిహారిక.. డ్రీమ్ మూమెంట్ అంటూ వీడియో పోస్టు
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్‌కు ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: హాలీవుడ్ (Hollywood) యాక్షన్ హీరో టామ్ క్రూజ్‌కు (Tom Cruise) ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా టామ్ 'మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్ (Mission: Impossible The Final Reckoning)' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మే 17న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల అయింది. పారామౌంట్ పిక్చర్స్, స్కై డ్యాన్స్ టీసీ ప్రోడక్షన్స్ బ్యానర్స్‌పై టామ్ క్రూజ్, క్రిస్టోఫర్ మెక్‌క్యూరేలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని దాదాపు 400 మిలియన్ల బడ్జెట్‌తో (భారత కరెన్సీలో రూ.3,400 కోట్లు) తెరకెక్కించారు. ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక టామ్ క్రూజ్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.
నిహారిక (Niharika) సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో అడవి శేష్ నటించిన మేజర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో సూపర్‌స్టార్ మహేష్ బాబుతో చేసిన వీడియోతో జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి ఇండియన్ టాప్ స్టార్స్ అందరితో కూడా ఆమె సినిమా ప్రమోషన్‌లో భాగంగా కంటెంట్ క్రియేషన్స్‌తో హైలెట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ సినిమా ప్రమోషన్‌లోనూ భాగమయ్యారు. మిషన్ ఇంపాజిబుల్ మూవీ టీం తాజాగా యూకేలో ప్రీమియర్ షో నిర్వహించింది. ఈ ప్రీమియర్ షోకు వివిధ దేశాలకు చెందిన సోషల్‌మీడియా తారలను ఆహ్వానించింది. ఈ సందర్భంగా నిహారిక టామ్ క్రూజ్‌ను కలిసే అద్భుత అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిహారిక సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక నిహారిక ఇటీవల తమిళ సినిమా పెరుసులో నటించి, అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందే సినిమాలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఆమె భాగమవుతున్నట్లు సమాచారం.






