- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరల్ వీడియో: లండన్‌లో బుల్లెట్ దిగే దృశ్యం చూసి నెటిజన్లు షాక్!
ఇటీవల కాలంలో మన దేశం నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ తదితర విదేశాల్లో స్థిరపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో మన దేశం నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ తదితర విదేశాల్లో (Foreign countries) స్థిరపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉద్యోగాలు, ఉన్నత చదువులు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం చాలా మంది విదేశాల బాటపడుతున్నారు. అలాంటి సమయంలో ఎక్కువగా తమ ఇల్లు, ఇంటి ఫర్నిచర్, వాహనాలు లాంటి ముఖ్యమైన వస్తువులను ఇక్కడే వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ఆ దేశంలో ప్రారంభించాల్సి వస్తుంది. ఎందుకంటే, ఈ వస్తువులను ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలించాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అయితే ఓ పంజాబీ కుటుంబం మాత్రం అలా తమకు ఇష్టమైన వస్తువులను వదిలేసి వెళ్లలేకపోయింది. తమతోపాటు ఆ వస్తువులను తీసుకెళ్లేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేసింది. ప్రస్తుతం ఈ ఘటన నెటిజన్ల దృష్టిని ఆకర్షించటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పంజాబ్ (Punjab) రాష్ట్రానికి చెందిన రాజగురు కుటుంబం ఇక్కడి నుంచి వెళ్లి ఇటీవల లండన్‌లో (London) స్థిరపడింది. తమ కుటుంబీకులకు ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్, స్వదేశపు ఫర్నిచర్‌ను కూడా తమతోపాటు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇవన్నీ ఇండియా నుంచి యూకేకు షిప్పింగ్ చేసేందుకు ఏకంగా 4000 పౌండ్లు (అంటే దాదాపు రూ.4.6లక్షలు) ఖర్చు చేసింది. యూకేలోని తమ ఇంటి ముందు ఓ పెద్ద కంటైనర్ నుంచి బైక్‌తో పాటు సోఫాలు, బెడ్లు, డైనింగ్ టేబుల్ బయటు తీస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు ఇప్పటివరకు 39 లక్షలకు పైగా వ్యూస్, 2.4 లక్షల లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ .. 'ఇది అసలైన బాస్ బిహేవియర్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.






