- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: మేడం సార్ మేడం అంతే.. నీ ఐడియాకు టేక్ ఎ బౌ అంటూ కామెంట్స్..
సాధారణంగా చాలా మంది మగవారు నిద్రపోయేటప్పుడు బాగా గురక పెడుతుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలా మంది మగవారు నిద్రపోయేటప్పుడు బాగా గురక పెడుతుంటారు. దీని వల్ల పక్కన పడుకున్న వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే చిన్నగా గురక తీయడం వల్ల అంతగా ఇబ్బంది కలగదు కానీ కొంతమంది ఘోరంగా గురక తీస్తుంటారు. దీని వల్ల ఇంట్లో వారు చాలా ఇబ్బందికి లోనవుతారు. అయితే ఈ వీడియోలో ఉన్న భార్య.. భర్త గురకతో ఓ మంచి ఐడియాను అప్లై చేసింది. ఫస్ట్ తన భర్త గురకను ఫోన్‌లో రికార్డు చేసి మేడ మీద ఆరపోసిన వడియాలను కాకులు తినకుండా అక్కడ తన భర్త గురక తీస్తున్న రికార్డింగ్‌ను ఆన్ చేసి పెట్టింది. దీంతో ఆ సౌండ్ విన్న కాకులన్నీ అక్కడి నుంచి పరార్. అలాగే పాల దగ్గర కూడా సేమ్ సీన్ రిపీట్ చేసింది.
అక్కడికి పాలు తాగడానికి వచ్చిన పిల్లి కూడా ఏంట్రా ఈ సౌండ్ చంపేస్తారా ఏంటి అని అక్కడి నుండి పారిపోతుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనేలా భార్య మరో ఐడియాను వాడేసిందండి. అదేంటంటే.. నేను ఒక బెలూన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. బర్త్‌డే పార్టీస్‌కు బెలూన్స్ కావాలనుకునే వారు నన్ను సంప్రదించండి అని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆ బెలూన్స్‌ను కూడా బాగా గురక తీస్తున్న భర్త మూతికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి లోపల నుంచి వస్తున్న గాలితో బెలూన్స్ అన్ని పెద్దగా అయిపోయేలా చేసేసింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మేడం సార్ మేడం అంతే నీ ఐడియాకు టేక్ ఎ బౌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






