Viral Video: ఎంతకు తెగించారు రా.. చీర కట్టడం రాకుంటే నేర్చుకోవాలి కానీ ఇలాంటివి వేసుకుని మోసం చేస్తారా

by I. Sairam |

సాధారణంగా ఆడవాళ్లకు చీరలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Viral Video: ఎంతకు తెగించారు రా.. చీర కట్టడం రాకుంటే నేర్చుకోవాలి కానీ ఇలాంటివి వేసుకుని మోసం చేస్తారా
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఆడవాళ్లకు చీరలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీరువాలో ఎన్ని శారీలు ఉన్నప్పటికీ వారికి ఇంకా ఇంకా కొని దాచుకోవాలనే కోరిక వారిది. అయితే ఆడవాళ్లు ఏదైనా ఫంక్షన్‌కు వెళితే శారీ డ్రాప్ చేయడానికే సగం టైం అయిపోతుంది. దీంతో వాళ్లకు అందం వస్తుందో రాదో ఏమో తెలియదు కానీ భర్తలతో మాత్రం చీవాట్లు కచ్చితంగా పడతాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మార్కెట్‌లో 5నిమిషాల చీర వచ్చేసింది. ఏంటి నిజమా అంటే అవుననే చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ మహిళ చీరను కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే కట్టేసి చూపించింది. అయితే ఈ శారీకు అటాచ్ బ్లౌజ్ కూడా వస్తుండటం విశేషం. దీంతో కేవలం ఐదే ఐదు నిమిషాల్లో చీర కట్టుకుని ఫంక్షన్స్‌కు వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక దీన్ని చూసిన మేల్ నెటిజన్స్.. చీర కట్టడం రాకుంటే నేర్చుకోవాలి కానీ ఇలాంటివి వేసుకుని మోసం చేస్తారా అని కామెంట్స్ చేస్తుంటే ఆడవాళ్లు మాత్రం షాపు పేరు చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Next Story