Viral Video: చెరసాల నుంచి బయటపడ్డ సంతోషం.. జైలు ముందే బ్రేక్ డ్యాన్స్

by Ramesh Goud |   (  Updated:2024-11-29 13:18:27  IST  )

చెరసాల(Jail) నుంచి బయటపడ్డ సంతోషంలో ఓ వ్యక్తి జైలు ముందే బ్రేక్ డ్యాన్స్(Break Dance) వేసిన ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో జరిగింది.

Viral Video: చెరసాల నుంచి బయటపడ్డ సంతోషం.. జైలు ముందే బ్రేక్ డ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: చెరసాల(Jail) నుంచి బయటపడ్డ సంతోషంలో ఓ వ్యక్తి జైలు ముందే బ్రేక్ డ్యాన్స్(Break Dance) వేసిన ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యూపీలోని కన్నౌజ్(Kannauj) ప్రాంతానికి చెందిన శివ(Shiva) అనే వ్యక్తి ఓ దాడి కేసులో జైలుకు వెళ్లాడు. శిక్ష పూర్తి కావడంతో జైలు నుంచి విడుదల అయ్యాడు. బంధిఖానా నుంచి విడుదల అయిన సంతోషంలో జైలు ముందే బ్రేక్ డ్యాన్స్ చేసి దుమ్ములేపాడు. జైలు గేటు ఎదుట అధికారులు చూస్తుండగా.. ఓ హింది పాటకు మైకేల్ జాక్సన్(Michael Jackson) స్టైల్లో స్టెప్పులు వేసి అందరినీ అబ్బురపరిచాడు. దీనిని శివ సన్నిహితుడు చిత్రీకరించి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్(Viral) గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శివ డాన్స్ కి ఫిదా అవుతున్నారు. అంతేగాక అతని టాలెంట్ ని మెచ్చుకుంటున్నారు. ఇంత టాలెంట్ ఉండి కూడా తోందరపాటులో చేసిన తప్పుల వల్ల చాలా మంది జైళ్లపాలు కావాల్సి వస్తుందని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Next Story