Viral video: ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్తున్నారా? నాశనం చేయడానికి వెళ్తున్నారా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-14 16:01:56  IST  )

మన దేశంలో ప్రకృతి మనోహర దృశ్యాలకు కొదువలేదు. ఎత్తైన హిమాలయ పర్వతాల నుంచి సముద్ర తీరాల వరకు, ఉరకలేస్తున్న జలపాతాల నుంచి శాంతియుత నదుల వరకు..

Viral video: ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్తున్నారా? నాశనం చేయడానికి వెళ్తున్నారా?
X

దిశ, వెబ్ డెస్క్: మన దేశంలో ప్రకృతి మనోహర దృశ్యాలకు కొదువలేదు. ఎత్తైన హిమాలయ పర్వతాల నుంచి సముద్ర తీరాల వరకు, ఉరకలేస్తున్న జలపాతాల నుంచి శాంతియుత నదుల వరకు.. అడుగడుగునా ప్రకృతి తన వైభవాన్ని విరజిమ్ముతోంది. ఈ శోభను ఓ మారు చూడాలని, రోజువారి బిజీ జీవితానికి చిన్న విరామం ఇవ్వాలని, అనేక మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పర్యాటక ప్రదేశాలను (Tourist places) సందర్శిస్తూ ఉంటారు. అలా రెండు రోజులు ప్రకృతి ఒడిలో గడిపితే వచ్చే మానసిక శాంతి, ఉల్లాసం మాటల్లో చెప్పలేం. అయితే, ఈ అందాలను ఆస్వాదించడం సరే.. వాటిని పరిరక్షించడం మనందరి బాధ్యత. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని (Himachal Pradesh) లాపాస్ వాటర్‌ఫాల్ (Lapas Waterfall) వద్ద ఒక విషాదకర దృశ్యం సోషల్ మీడియాలో (Social media) ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను తన ఖాతాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వాటర్‌ఫాల్ వద్ద పర్యాటకులు మద్యం సేవిస్తూ, ఖాళీ బాటిళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలను నీటిలో పడేస్తుండడం కనిపిస్తోంది. ఈ పరిస్థితిని విమర్శిస్తూ, ఆ యూజర్ తన వీడియోకు వ్యంగ్యంగా 'ఇండియాకే పాస్ బెస్ట్ సివిక్ సెన్స్' అంటూ క్యాప్షన్ పెట్టారు. సమీపంలో ఉన్న తాత్కాలిక ఫుడ్ స్టాళ్లు కూడా పర్యావరణంపై ప్రభావం చూపుతున్నాయని, అవి ట్రాఫిక్‌కు, చెత్తకు కేంద్రబిందువులుగా మారాయని యూజర్ పేర్కొన్నారు. ఇక అందమైన ప్రకృతిని పర్యాటకులు అలా నాశనం చేస్తుండటం చూసి నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'ఇది ఎంతో దురదృష్టకరం', 'ఇలాంటి ప్రవర్తన మన దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది', 'పర్యాటకులు పిక్నిక్ చేసేవారు కానీ శుభ్రం చేయడం మరిచిపోతారు' అంటూ నెటిజన్లు కామెంట్లలో తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Click For Instagram post..

బీచ్‌లో పెళ్లి వేడుక.. నగ్నంగా వధూవరులు.. ఒంటిపై నూలు పోగు లేకుండా అతిథుల హాజరు.. ప్రపంచానికి ఇచ్చిన మెస్సేజ్ ఇదే!

Next Story