- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Viral: స్వచ్ఛమైన తండ్రి ప్రేమకు నిదర్శనం ఇదే..! కానీ ప్రేమతో పాటు ప్రమాదం కూడా

దిశ, వెబ్ డెస్క్: స్వచ్ఛమైన తండ్రి ప్రేమ(Dad's love)కు నిదర్శనం ఇదేనని సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతున్న ఓ వీడియోపై నెటిజన్లు కామెంట్లు(Comments) చేస్తున్నారు. నవమాసాలు మోసిన తల్లికి తన పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందో వారిని కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రికీ అంతే ప్రేమ ఉంటుంది. పిల్లలు పెరిగి పెద్ద అయ్యే వరకు వారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా తల్లిదండ్రులే ఆలనాపాలనా చూసుకుంటారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్(UP) లో ఓ తండ్రి తన కుమారుడికి రక్షణగా నిలుస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో ఓ తండ్రి తెల్లవారుజామున తన కుమారుడిని బైక్ పై వెనకాల కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నాడు. అదే సమయంలో బాలుడు బండి మీదనే నిద్ర పోవడంతో తన కుమారుడు పడిపోకుండా ఓ చేత్తో పట్టుకొని, మరో చేత్తో బైక్ నడుపుతున్నాడు. ఈ దృష్యాలను వెనుక కార్ లో వెళుతున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. స్వచ్ఛమైన తండ్రి ప్రేమకు నిదర్శనం ఇదేనని, ఆ తండ్రి కొడుకు పట్ల తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని అంటున్నారు. అంతేగాక ఇందులో ప్రేమ ఎంత ఉందో.. ప్రమాదమూ అంతే ఉందని పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.