- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL: దేశం పరువు తీశారుగా..! దొంగతనం చేస్తూ దొరికిన ఇండియన్ టూరిస్టులు
ఇండోనేషియా దేశంలోని బాలిలో ఉన్న అస్వార రిసార్ట్‌లో భారతీయ పర్యాటకులు దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయారు

దిశ, వెబ్‌డెస్క్: సరదాగా విదేశీ పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయ పర్యాటకులు దేశం పరువులు తీసేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇండోనేషియాలోని బాలి (Bali)లో గల ఒక రిసార్ట్ నుంచి వస్తువులను దొంగిలిస్తూ ఓ పర్యాటక బృందం సిబ్బందికి అడ్డంగా దొరికిపోయింది. అయితే, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లగేజీ చెక్ చేయగా.. షాక్
బాలిలోని జియన్ యార్ (Gianyar) ప్రాంతంలో ఉన్న అస్వార రిసార్ట్ ఉబుద్ (Asvara Resort Ubud) లో నలుగురు భారతీయ పర్యాటకులు ఏప్రిల్ 16 నుంచి బస చేశారు. ఏప్రిల్ 19న వారు హోటల్ ఖాళీ చేసి వెళ్తున్న సమయంలో (Check-out), గదిలోని కొన్ని వస్తువులు కనిపించకపోవడాన్ని హోటల్ సిబ్బంది గమనించారు. దీంతో అనుమానం వచ్చి పర్యాటకుల లగేజీని తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. సిబ్బంది వారి బ్యాగులను తెరిచి చూడగా.. అందులో హోటల్‌కు చెందిన టవల్స్, హెయిర్ డ్రైయర్, కిమోనో రోబ్స్, డోర్ మ్యాట్, టీవీ రిమోట్ బాక్స్, డైనింగ్ వస్తువులు బయటపడ్డాయి. ఈ తతంగాన్ని తాజాగా తరుణ్ గౌతమ్ అనే నెటిజన్ ఆ వీడియోను ‘X’ (ట్విట్టర్)లో షేర్ చేస్తూ.. ‘ఇది ఎంతో అవమానకరం’ అని పేర్కొన్నారు. ఈ వీడియోలో హోటల్ సిబ్బంది వస్తువులను బయటకు తీస్తుండగా, పర్యాటకులు సిబ్బందితో వాదించడం కనిపిస్తుంది’ అంటూ పోస్ట్ చేశారు.
అయితే, దొంగతనం ఘటనపై జియన్ యార్ పోలీస్ ప్రతినిధి ఇప్తు ఐ గుస్తీ గురా సుర్దిత స్పంది.. హోటల్ యాజమాన్యం, పర్యాటకుల మధ్య పరస్పర అంగీకారంతో ఈ వివాదం పరిష్కారమైందని తెలిపారు. పర్యాటకులు దొంగిలించిన వస్తువులన్నీ తిరిగి ఇచ్చేయడంతో, హోటల్ యాజమాన్యం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు.






