- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: చిత్రం భళారే విచిత్రం..! రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష పెట్టిన ట్రంప్
వైట్‌హౌస్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: వైట్‌హౌస్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా సంప్రదాయంలో అత్యంత అట్టహాసంగా జరిగే ‘నేషనల్ థ్యాంక్స్ గివింగ్ టర్కీ’ (‘National Thanksgiving Turkey’) వేడుకల్లో భాగంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President) రెండు టర్కీ (Turkey) కోళ్లకు క్షమాభిక్షను ప్రసాదించారు. ప్రతి ఏటా థ్యాంక్స్ గివింగ్ డేకు ముందు శ్వేత సౌధంలోని రోజ్ గార్డెన్‌లో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రెసిడెంట్ ట్రంప్ ‘కార్న్’ (Corn) అనే టర్కీ కోడిని క్షమించి ప్రాణభిక్ష పెట్టారు. అయితే, ఈ ఈవెంట్‌లో ట్రంప్ సరదాగా “కార్న్.. నీకు పూర్తి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నాను” అని కామెంట్ చేశారు. ఈ పోటీలో కార్న్‌తో పాటు విజేతగా నిలిచిన ‘కోబ్’ (Kobe) అనే టర్కీ కోడికి కూడా అధ్యక్షుడు స్వేచ్ఛను ప్రసాదించారు. ఈ సంప్రదాయం ప్రకారం.. ప్రెసిడెంట్ క్షమాభిక్ష పొందిన టర్కీ కోళ్లు ఇకపై వధించబడకుండా, వాటి జీవితాంతం వ్యవసాయ క్షేత్రాల్లో హాయిగా విహరించేందుకు వీలు కల్పిస్తారు.






