- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: ఒక్కటి పీకండి, తన్నండి.. ఉద్యోగులపై కలెక్టర్ అనుచిత వ్యాఖ్యలు (వీడియో)
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. కలెక్టర్ నుంచి బీఎల్‌వోల వరకు ఇందులో భాగస్వాములై విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కింది స్థాయిలో ఉద్యోగులపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారమే రేపుతున్నాయి. ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన ఓ అధికారిక వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఉద్యోగులను ఉద్దేశించి అత్యంత కఠినమైన పదజాలంతో మాట్లాడటం సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వీడియో కాన్ఫరెన్స్‌లో జరిగింది ఇదే..
ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల సంస్కరణల ప్రక్రియ (SIR) విధులకు సంబంధించి జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎస్ఐఆర్ ప్రక్రియ విధుల్లో ఎవరైనా సరిగా పనిచేయకపోతే.. లాగిపెట్టి ఒక్కటి పీకండి, తన్నండి’ అంటూ అధికారుల ముందే కలెక్టర్ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. అయితే, కలెక్టర్ చేసిన ఈ వ్యాఖ్యలపై జిల్లాలోని ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, తోటి ఉద్యోగులను అవమానించేలా ఇలాంటి భాషను ఉపయోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






