- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL: సార్.. నన్ను ఎలాగైనా పాస్ చేయండి: ఇంటర్ బోర్డుకు విద్యార్థి ఫోన్ కాల్
ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల వేళ విశాఖకు చెందిన ఓ విద్యార్థి బోర్డు అధికారులకు ఫోన్ చేసి తనను పాస్ చేయాలని కోరడం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ (AP Intermediate) ఫలితాల విడుదల వేళ ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫలితాలు వెలువడక ముందే తనను ఎలాగైనా పాస్ చేయాలంటూ విశాఖపట్నానికి (Vishakhapatnam) చెందిన ఓ విద్యార్థి నేరుగా ఇంటర్ బోర్డు అధికారులకే ఫోన్ చేసి వేడుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తాను పరీక్షలు సరిగ్గా రాయలేదని, ఫెయిల్ అవుతాననే భయంతో బుధవారం ఆ విద్యార్థి అధికారులకు ఫోన్ చేశాడు. ఆన్సర్ షీట్ల (Answer Sheets)లో డబ్బులు కూడా పెట్టానని, వాటిని చూసైనా తనను పాస్ చేయాలని కోరడం గమనార్హం. పరీక్షలో ఏమీ చదవకపోవడం వల్ల ఏమీ రాయలేకపోయానని, అందుకే ఇచ్చిన ప్రశ్నాపత్రాన్నే మూడు సార్లు సమాధాన పత్రంలో రాశానని ఆ విద్యార్థి అధికారులకు నిజాయతీగా ఒప్పుకున్నాడు. విద్యార్థి మాటలు విని ఆశ్చర్యపోయిన బోర్డు అధికారులు, అతనికి ధైర్యం చెప్పారు. ఇలాంటి పనులు చేయవద్దని, త్వరలోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని, ఈసారి బాగా చదువుకుని పరీక్ష రాయాలని ఫోన్‌లోనే కౌన్సెలింగ్ ఇచ్చారు.
చివరికి ఫలితం ఎలా ఉందంటే..
కాగా, గురువారం విడుదలైన ఫలితాల్లో సదరు విద్యార్థి అనకున్నట్లుగానే ఫెయిల్ అయ్యాడు. అతడు ఫస్టియర్‌లో రెండు సబ్జెక్టులు, సెకండియర్‌లో మూడు సబ్జెక్టులు తప్పినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతోంది.






