VIRAL: దుకాణదారుడి ఔదార్యం: ఏకంగా షాపులో వీధి కుక్కలకు ఆశ్రయం

by Kema Shiva Kumar |

మండే ఎండల నుంచి వీధి కుక్కలకు ఉపశమనం కలిగించేందుకు ఓ దుకాణదారుడు చేసిన పని నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

VIRAL: దుకాణదారుడి ఔదార్యం: ఏకంగా షాపులో వీధి కుక్కలకు ఆశ్రయం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఎండలు ఎన్నడూ లేని విధంగా ఠారెత్తిస్తున్నాయి. మనుషులే బయటకు రావాలంటే భయపడుతున్న ఈ తరుణంలో ఇక మూగజీవాల పరిస్థితి వర్ణనాతీతం. కొన్ని దప్పిక, ఆకలి ప్రాణలు కోల్పోతే, మరికొన్ని ఎండ వేడిమికి తాళలేక తనువు చాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ సామాన్య దుకాణదారుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

తీవ్రమైన ఎండల నుంచి రక్షణ పొందేందుకు కొన్ని వీధి కుక్కలు ఓ దుకాణం ముందు నిలబడ్డాయి. సాధారణంగా జంతువులను లోపలికి రానివ్వని చోట, సదరు దుకాణదారుడు మాత్రం కనికరంతో తన దుకాణం తలుపులు తెరిచాడు. లోపల ఏసీ గాలి వస్తుండటంతో ఆ కుక్కలన్నీ ప్రశాంతంగా నేలపై పడుకుని విశ్రాంతి తీసుకున్నాయి. అయితే, ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి ఫోటో తీసి నెట్టింట్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అది చూసిన కొందరు నెటిజన్లు ‘నిజమైన మనిషి అంటే ఇతడే’నని, మరొకొందరు ‘వ్యాపారం కంటే మానవత్వం గొప్పదని నిరూపించారు’ అంటూ కామెంట్లు చెస్తున్నారు.

Next Story