- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: బెంగాల్‌లో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్ నుంచి కిందపడిపోయిన బాలుడు
పశ్చిమ బెంగాల్‌లో గుండెలు పిండేసే ఘటన వెలుగుచూసింది. రన్నింగ్ ట్రైన్ నుంచి కిందపడిపోయిన తమ్ముడి కోసం ఓ సోదరి చేసిన ఆర్తనాదాలు ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ రైల్వేలో ప్రయాణికుల భద్రత ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టేలా పశ్చిమ బెంగాల్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రన్నింగ్ ట్రైన్ నుంచి ఓ బాలుడు ప్రమాదవశాత్తు కిందపడిపోగా.. తోటి ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్ లాగినా లోకో పైలట్ ఏమాత్రం పట్టించుకోకుండా రైలును 15 కి.మీ మేర ముందుకు తీసుకెళ్లిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
చైన్ లాగినా.. ఆపని లోకో పైలట్
రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఓ బాలుడు డోర్ వద్ద నిలబడి ఉండగా.. ప్రమాదవశాత్తూ కింద పడిపోయిడు. అది గమనించిన అతడి అక్క కేకలు వేయడంతో, తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ అలారం చైన్ (Alarm Chain) లాగారు. నిబంధనల ప్రకారం చైన్ లాగగానే లోకో పైలట్ రైలును నిలిపివేయాలి. కానీ, ఈ ఘటనలో లోకో పైలట్ చైన్ పుల్లింగ్‌ను బేఖాతరు చేస్తూ ఏకంగా 15 కి.మీ దూరం రైలును ఆపకుండా తీసుకెళ్లాడు. మరోవైపు తన తమ్ముడు ఎక్కడ ఉన్నాడో, ప్రాణాలతో ఉన్నాడో లేదో అని ఆ సోదరి ఏడుస్తూ రైలులోని టీటీఈ (TTE) ని ఆశ్రయించింది. అయితే, ఆయన నుంచి, రైల్వే హెల్ప్‌లైన్ నుంచి కూడా రెస్పాన్స్ రాలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ‘నా తమ్ముడిని కాపాడండి’ అంటూ ఆ బాలిక పెట్టిన ఆర్తనాదాలు రైలులోని ప్రయాణికులందరినీ కలచివేశాయి. అయితే, ఈ మొత్తం తతంగాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.






