- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Photo: ఓరి మీ దుంపలు తెగ.. అర్థం చేసుకోవడానికే ఐదు నిమిషాలు పట్టింది కదరా.. నీ క్రియేటివిటీకి టేక్ ఎ బౌ..
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం ఎంతగా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం ఎంతగా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు మన లైఫ్‌లో జరిగే వన్నీ తీసి నెట్టింట పెట్టేస్తున్నారు. సాధారణంగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తిని హాస్పిటల్‌కి తీసుకెళ్లడం పక్కన పెట్టి ఇక్కడ రోడ్డు ప్రమాదం అయింది ఫ్రెండ్స్ అని కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పెట్టడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారు అనేది మాత్రం మన చేతిలో లేదు. కానీ ఎత్తినంత ఎత్తి మళ్లీ కింద పడేస్తారు కూడా.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. అందులో ఓ అమ్మాయి బీచ్‌లో ఇసుక మీద పడుకుంది. అయితే పక్కనే ఆమె షాడో(నీడ) కూడా కనిపిస్తుంది. అయితే అది షాడో కాదు నల్లని వస్త్రాన్ని అలా నీడలాగే కనిపించే విధంగా సెట్ చేశారు. ఇక ఈ పిక్‌ను సడెన్‌గా చూస్తే గాల్లో అమ్మాయి తేలుతున్నట్టు, కింద నీడ కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. తీరా చాలా సేపు ఆ ఫొటోను అబ్జర్వ్ చేస్తే కానీ అసలు విషయం బోధపడక మానదు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు ఓరి మీ దుంపలు తెగ ఐదు నిమిషాలు అబ్జర్వ్ చేస్తే కానీ అసలు విషయం అర్థం కాలేదు కదరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది ఫొటోగ్రాఫర్ టాలెంట్‌కు టేక్ ఎ బౌ అంటూ అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read More..
Trending Video: ఏందిరా అయ్యా.. ఇది ఇప్పట్లో ఆగేలా లేదుగా..






