- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL: కిలో బెండకాయలు రూ.7,200..! ధర చూసి భారతీయుడి మైండ్‌బ్లాంక్
బెండకాయ కూర తినాలంటే బ్యాంక్ లోన్ తీసుకోవాలా..? అమెరికాలో కిలో ధర చూసి ఓ భారతీయుడు పెట్టిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: రోజూ కూరల్లో ఉపయోగించే సాదాసీదా బెండకాయ (Okra) ధర సాధారణంగా మన దేశంలో కిలో రూ.40 నుంచి రూ.60 మధ్య ఉంటుంది. కానీ అదే బెండకాయ అమెరికాలో ఏకంగా బంగారం ధరతో పోటీ పడుతోంది. యూఎస్‌లోని ఓ ప్రముఖ సూపర్ మార్కెట్‌లో బెండకాయల ధర చూసి ఒక భారతీయ వ్యక్తి షాక్ తిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ చేస్తోంది.
అమెరికాలో నివసిస్తున్న ఒక భారతీయుడు స్థానిక గ్రోసరీ స్టోర్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఇండియన్ వెజిటబుల్స్ సెక్షన్‌లో ఉన్న బెండకాయలను చూశాడు. అయితే, అక్కడ కిలో బెండకాయల ధరను చూసి అతడికి ఒక్కసారిగా నోట మాట రాలేదు. అక్కడ అర కిలో బెండకాయల ధర దాదాపు 40 డాలర్లుగా ఉంది. మన భారతీయ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే.. ఒక కిలో బెండకాయల ధర అక్షరాలా రూ.7,200 పైమాటే అన్నమాట. ఆ రేట్‌ను చూపిస్తూ ఆ వ్యక్తి చేసిన రికార్డింగ్ ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయగా, అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ‘ఇంత ధర పెట్టి బెండకాయలు కొని తినడం కంటే.. ఆ డబ్బుతో విమానం ఎక్కి ఇండియాకు వెళ్లి కడుపు నిండా బెండకాయ కూర తిని తిరిగి రావడం బెటర్’ కదా అంటూ సదరు వ్యక్తి వీడియోలో కామెంట్ చేశాడు. ఇదే వీడియోపై నెటిజన్లు, ముఖ్యంగా ప్రవాస భారతీయులు ‘చిన్నప్పుడు బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని ఇంట్లో వాళ్లు చెప్పారు.. కానీ అమెరికాలో ఈ బెండకాయ కొనాలంటేనే పెద్ద పెద్ద లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది’ అని కామెంట్ చేస్తున్నారు. మరొకరు, ‘ఆ రేటు చూశాక నాకు బెండకాయ మీద ఆశ చచ్చిపోయింది.. మన పప్పు చారు నయం’ అని రాసుకొచ్చారు.






