DRDOలో కొలువుల జాతర.. ఏకంగా రూ.1.23 లక్షల వరకూ జీతం

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-07 03:01:32  IST  )

డీఆర్డీవో (DRDO)లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది.

DRDOలో కొలువుల జాతర.. ఏకంగా రూ.1.23 లక్షల వరకూ జీతం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రక్షణ శాఖకు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)లో ఉద్యోగా జాతర మొదలైంది. అనుభవజ్ఞులైన సైన్స్, ఇంజనీరింగ్ నిపుణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డీఆర్డీవో రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RAC) అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ 157 కింద లాటరల్ ఎంట్రీ పద్ధతిలో వివిధ గ్రేడ్‌ల సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 రెగ్యులర్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు సైంటిస్ట్ ‘C’ (20 పోస్టులు)కు బేసిక్ పే రూ.67,700, సైంటిస్ట్ ‘D’ (11 పోస్టులు)‌కు బేసిక్ పే రూ.78,800, సైంటిస్ట్ 'E' (02 పోస్టులు)కు బేసిక్ పే రూ.1,23,100 ఉంది.

అర్హతలు, వయోపరిమితి ఇలా..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో (ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఏరోస్పేస్, కెమికల్ ఇంజనీరింగ్ లేదా ఫిజిక్స్/మ్యాథమెటిక్స్) కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. సైంటిస్ట్ C పోస్టుకు కనీసం 3 ఏళ్లు, సైంటిస్ట్ Dకి 7 ఏళ్లు, మరియు సైంటిస్ట్ E పోస్టుకు కనీసం 11 ఏళ్ల సంబంధిత పని అనుభవం (Work Experience) తప్పనిసరి. సైంటిస్ట్ C అభ్యర్థులకు గరిష్ట వయస్సు 35 ఏళ్లు, సైంటిస్ట్ D, E పోస్టులకు గరిష్ట వయస్సు 45 ఏళ్లు మించకూడదు. అభ్యర్థుల దరఖాస్తులను అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ స్క్రీనింగ్ చేసిన అనంతరం, షార్ట్‌లిస్ట్ చేసిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ (పురుషులు) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.100 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. అయితే, ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు డీఆర్డీవో అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా జూన్ 19, సాయంత్రం 4 గంటల లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Next Story