VIRAL: మాట నిలబెట్టుకొన్న ఎమ్మెల్యే.. నాలుగేళ్ల తర్వాత హెయిర్ కట్

by Kema Shiva Kumar |

రాజకీయాల్లో ఇచ్చిన మాటకు విలువ లేని కాలం ఇది. హా

VIRAL: మాట నిలబెట్టుకొన్న ఎమ్మెల్యే.. నాలుగేళ్ల తర్వాత హెయిర్ కట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో ఇచ్చిన మాటకు విలువ లేని కాలం ఇది. హామీలను విస్మరించి దగా చేస్తున్న కలియుగంలో ప్రజల మాటకు కట్టుబడి ఓ ఎమ్మెల్యే చేసిన పని అందరికి శభాష్ అనిపించేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ముంబై (Mumbai)లోని ఘట్‌కోపర్ వెస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామ్ కదం (Ram Kadam) పోటీ చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన కొండ ప్రాంతాలు, గుడిసెల ప్రాంతాల్లో దీర్ఘకాలిక నీటి కొరత సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అప్పటికే తాను క్షౌరం చేసుకోబోనని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన రామ్ కదం.. 20 మిలియన్ లీటర్లకు పైగా ఉండే పెద్ద నీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టి భండూప్ నుంచి నీటి సరఫరా కోసం ప్రత్యేక పైప్‌లైన్ వేసే పనులకు శ్రీకారం చుట్టాడు.

అయితే, నాలుగేళ్ల తర్వాత తాజాగా ఆ పనులు ప్రారంభం కావడంతో ఇచ్చిన మాటలకు కట్టుబడి ప్రజల సమక్షంలో హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్ కదం మాట్లాడుతూ.. కొండ ప్రాంతాలకు నీరు ఎలా అందించాలని ఆలోచించానని అన్నారు. 2 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులు నిర్మించామని, భండూప్ నుంచి పైప్‌లైన్ కూడా కనెక్ట్ అయిందని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలంతా తన కుటుంబంతో సమానమని.. వాళ్ల కోసం ఏం చేసినా తక్కువేనని ఎమ్మెల్యే రామ్ కదం ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన హెయిర్ కట్ చేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే మాట మీద నిలబడటం పట్ల నెటిజన్లు.. వారెవ్వా అంటూ అభినందిస్తున్నారు.

Next Story