VIRAL: ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-27 02:27:19  IST  )

మంత్రి నరహరి జిర్వాల్, ట్రాన్స్‌జెండర్ మహిళ‌కు సంబంధించిన అసభ్యకర వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

VIRAL: ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ మంత్రి, ఎన్‌సీపీ (NCP) కీలక నేత నరహరి జిర్వాల్ (Narahari Zirwal) ఓ ట్రాన్స్‌జెండర్ (Transgender) మహిళతో సన్నిహితంగా ఉన్న అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగుతోంది.

అధికారిక నివాసంలోనే అశ్లీల పర్వం..

వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ఈ ఘటన మంత్రికి కేటాయించిన ప్రభుత్వ అధికారిక నివాసంలోనే జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వీడియోలో మంత్రి జిర్వాల్‌తో పాటు పవన్ యాదవ్ అనే ట్రాన్స్‌జెండర్ వ్యక్తి కనిపించాడు. పవన్ యాదవ్ (Pavan Yadav) రాష్ట్రంలోనే మొదటి ట్రాన్స్‌జెండర్ లాయర్ అని సమాచారం. ఈ వీడియోలో మద్యం సీసాలు కూడా కనిపిస్తుండటంతో ప్రభుత్వ నివాసాన్ని ఇలాంటి అనైతిక పనులకు ఎలా వాడుతారని సామాజిక కార్యకర్త అంజలి దమానియా, విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

హనీట్రాప్, బ్లాక్‌మెయిల్ కోణం..

ఈ వీడియో బయటకు రావడానికి పవన్ యాదవ్ సోదరుడు రవి యాదవ్ కారణమని తెలుస్తోంది. పవన్ యాదవ్ గతంలో కూడా అనేకమందిని భయపెట్టి వసూళ్లకు (Extortion) పాల్పడేవారని, ఇప్పటికే అతడిపై ముంబైలోని కురార్ పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నాయని రవి ఆరోపించారు. ఇది పక్కా హనీట్రాప్ ముఠా పని అని, ఈ ఉచ్చులో కేవలం జిర్వాల్ మాత్రమే కాకుండా మరికొంతమంది కీలక మంత్రులు కూడా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు మంత్రి వ్యవహారంపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ (Harshavardhan Sapkal) ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటం సిగ్గుచేటని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఎన్‌సీపీ నేత అమోల్ మిత్కారీ మాత్రం మంత్రికి మద్దతుగా నిలిచారు. ఆరు నెలల క్రితం నాటి వీడియోను ఇప్పుడు ఎందుకు బయటపెట్టారని, ఇది కావాలనే చేస్తున్న కుట్ర అని ఆయన వాదించారు.

Next Story